Visakhapatnam: నూకరాజుకి ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్లే: పీవీఎన్ మాధవ్!

Visakhapatnam: జీవీఎంసీ 88వ వార్డు గొంతినవానిపాలెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూటమి అభ్యర్థి నూకరాజు, మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి తరఫున ప్రచారం చేశారు.

PRAKASH, GAJUWAKA
Published on: 29 Oct 2026 6:57 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: నూకరాజుకి ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్లే: పీవీఎన్ మాధవ్!

విశాఖపట్నం: 88వ వార్డు గొంతినవానిపాలెంలో బిజేపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నియోజకవర్గం ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేసారు. కూటమి అభ్యర్థి సిరసపల్లి నూకరాజుకి కమలం గుర్తుపై , మేయర్ అభ్యర్థిని డాక్టర్ ముక్కా శ్రావణికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసారు.

నూకరాజుకి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లే అని ఆయన అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉందని, జిల్లాలో వార్డులో కూడా కూటమిని గెలిపించుకుంటే త్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

మూడు పార్టీలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయని, సంక్షేమం అభివృద్ధి పండ్లు ప్రజలకు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వరహాలరావు,జాగారపు శ్రీను,కిరణ్ శర్మ,ప్రసాద్,గోవింద్, నాయుడు, రమాదేవి బారీగ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA