Madhurawada: ప్రజా సమస్యలపై పోరాడే భారతిని గెలిపించండి: అప్పలరాజు!
Madhurawada: జీవీఎంసీ 7వ వార్డు పి.పి.-2 కాలనీలో సీపీఎం అభ్యర్థి బల్లంకి భారతి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే భారతిని గెలిపించాలని నేతలు కోరారు.
Madhurawada: ప్రజా సమస్యలపై పోరాడే భారతిని గెలిపించండి: అప్పలరాజు!
మధురవాడ: జీవీఎంసీ 7వ వార్డు సీపీఎం అభ్యర్థి బల్లంకి భారతి గురువారం పి.పి.-2 కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు డి. అప్పలరాజు మాట్లాడుతూ, పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే బల్లంకి భారతికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
కూటమి ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం పెంచే విధానాలను అనుసరిస్తోందని నాయకులు విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ పౌర సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలంటే ప్రజా ఉద్యమాలు అవసరమని అన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే సీపీఎం అభ్యర్థి బల్లంకి భారతికి సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అభ్యర్థి బి. భారతి, నాయకులు పి. రాజ్‌కుమార్, డి. కొండమ్మ, ఏ. గురుమూర్తి రెడ్డి, జి. మంగశ్రీ, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.




