Paderu: పాడేరులో ఘనంగా మహాకవి గురజాడ జయంతి వేడుకలు!
Paderu: పాడేరు కలెక్టరేట్‌లో ఘనంగా గురజాడ వెంకట అప్పారావు జయంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ నిశాంతి.
Paderu: పాడేరులో ఘనంగా మహాకవి గురజాడ జయంతి వేడుకలు!
Paderu: ఏ ఎస్ ఆర్ జిల్లా, పాడేరు లో మహాకవి, యుగపురుషుడు గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సోమవారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురజాడ అప్పారావు వారి చిత్ర పాఠనికి జిల్లా కలెక్టర్ నిశాంతి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ని శాంతి మాట్లాడుతూ మహా కవి రాసిన నాటకాలలో నాటక రాజం "కన్యాశుల్కం" ద్వారా ఆనాటి సమాజంలోని దురాచారాలను, మూఢనమ్మకాలను నిరసిస్తూ ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ నూతన దిశానిర్దేశం చేశారని కొనియాడారు.
"దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్" అని ఆయన అందించిన అమూల్యమైన సందేశం నిరంతరం స్పూర్తిదాయకమని, సదా ప్రాతఃస్మరణీయమని పేర్కొన్నారు. గురజాడ రచనలు, గేయాలు నేటికీ సామాజిక చైతన్యానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని కలెక్టర్ పేర్కోన్నారు.
మహాకవి చూపిన ఆదర్శవంతమైన బాటలో పయనిస్తూ, సమాజ శ్రేయస్సుకు,, అభ్యుదయానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.గురజాడ అప్పారావు సమాజానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఏం వి ఎస్ లోకేశ్వరావు, జిల్లా టూరిజం అధికారి చలపతి రావు, డిఏంహెచ్ఓ రియాజ్ బైగ్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




