Anakapalli: చోడవరం గర్ల్స్ హైస్కూల్ చైర్మన్‌గా సత్తిబాబు విజయం!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం గర్ల్స్ హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుమ్మాల సత్య సత్తిబాబు వరుసగా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుకు కృతజ్ఞతలు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 29 Sept 2026 1:42 PM IST
Anakapalli
X

Anakapalli: చోడవరం గర్ల్స్ హైస్కూల్ చైర్మన్‌గా సత్తిబాబు విజయం!

Anakapalli: చోడవరం గర్ల్స్ హైస్కూల్ స్కూల్ కమిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీ కేఎస్‌ఎన్‌ఎస్ రాజు గారు బలపరిచిన అభ్యర్థి శ్రీ గుమ్మాల సత్య సత్తిబాబు గారు వరుసగా రెండోసారి చైర్మన్‌గా ఘన విజయం సాధించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై మరోసారి నమ్మకం ఉంచి చైర్మన్‌గా గెలిపించిన ఎమ్మెల్యే శ్రీ కేఎస్‌ఎన్‌ఎస్ రాజు గారికి, తనకు ఓటు వేసి ఆశీర్వదించిన విద్యార్థుల తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రెండోసారి లభించిన ఈ బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తూ, గర్ల్స్ హైస్కూల్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని గుమ్మాల సత్య సత్తిబాబు స్పష్టం చేశారు.

విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, పాఠశాల మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, భద్రత, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం వంటి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తానని తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM