Ananthagiri: కొండను తొలిచే క్రమంలో పేలిన పేలుడు పదార్థాలు దారిన వెళ్లే వాహనాలు ధ్వంసం!
Ananthagiri: అల్లూరి జిల్లా పినకోట వద్ద రోడ్డు పనులకు అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఉపాధ్యాయురాలు, డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Ananthagiri: కొండను తొలిచే క్రమంలో పేలిన పేలుడు పదార్థాలు దారిన వెళ్లే వాహనాలు ధ్వంసం!
Ananthagiri: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా కొండను తొలిచేందుకు వినియోగించిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అనంతగిరి మండలం పినకోట వద్ద ఈ ఘటన జరిగింది.
రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా కొండను తొలిచేందుకు నిర్వాహకులు జిలెటిన్ స్టిక్స్ అమర్చారు. అవి పేలిన సమయంలో అటువైపుగా వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. పేలుడు ధాటికి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు, డ్రైవర్‌తో పాటు ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో విశాఖకు చెందిన ఉపాధ్యాయురాలు సునీత, దేవరాపల్లికి చెందిన కార్మికుడు మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడపకు చెందిన పవన్ కుమార్, టిప్పర్ డ్రైవర్ ఉన్నారు. పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఉపాధ్యాయురాలు సునీత ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.




