Simhachalam: తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన జర్నలిస్ట్ నేత గంట్ల!

Simhachalam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దర్శించుకుని, తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

GOPI, PENDURTHI
Published on: 27 Sept 2026 4:22 PM IST
Simhachalam
X

Simhachalam: తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన జర్నలిస్ట్ నేత గంట్ల!

Simhachalam: సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని ఆదివారం తెల్లవారుజామున సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మెట్ల మార్గంలో తొలి పావంచ వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెట్ల మార్గంలో కొలువున్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు తాకిడి గణనీయంగా పెరిగిందని ఇదే ఆధ్యాత్మిక వైభవం మరింతగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గంట్ల తెలిపారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI