Visakhapatnam: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు గంటా దూరం

Visakhapatnam: విశాఖపట్నం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిసెంబర్ 1న తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 29 Nov 2026 6:10 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు గంటా దూరం

విశాఖపట్నం: విశాఖపట్నం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. డిసెంబర్ 1 వ తేదీన పుట్టినరోజును వేడుకగా జరుపుకునే ఆయన పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

పంచాయతీ ఎన్నికలు డిసెంబరు 2 వ తేదీన జరుగుతున్నందున ఆ ముందురోజు కార్యకర్తలు, నాయకులు తన దగ్గరకు రావడం వల్ల ఎన్నికలపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అందుబాటులో ఉండకూడదని కూడా నిర్ణయించుకున్నారు. ప్రసార మాధ్యమాల్లో పుట్టినరోజు వేడుకల ప్రచారం తగ్గించారు.

ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించేలా పని చేయాలని పార్టీ శ్రేణులను ఆయన ఈ సందర్భంగా కోరారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో మాదిరిగా స్పూర్తిమంతమైన విజయాన్ని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సూచించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.