Visakhapatnam: వైసీపీ నేతలు నీటి సమస్యపై అనవసరంగా షో చేస్తున్నారు!
Visakhapatnam: కేజీబీవీ విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తాగునీటి సమస్యపై స్పష్టత.
Visakhapatnam: వైసీపీ నేతలు నీటి సమస్యపై అనవసరంగా షో చేస్తున్నారు!
Visakhapatnam: గంటా శ్రీనివాసరావు కామెంట్స్ KGBVలో విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో జుట్టు కత్తిరించినట్లు తెలుస్తుంది. తెల్లవారిన తర్వాత విషయం తెలిసి వెంటనే ఘటనపై విచారణ చేపట్టాం. ఇప్పటికే పోలీసులు KGBVలోని విద్యార్థులందరితో మాట్లాడారు.
అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. బయట నుంచి ఎవరైనా వచ్చి ఈ పని చేసే పరిస్థితి లేదు, సీసీ కెమెరాలను పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. నగరంలో నెలకొన్న నీటి సమస్యపై ముఖ్యమంత్రికి ఇప్పటికే వివరించాం.
హెలిప్యాడ్ వద్దే నీటి సమస్యపై సీఎం నుంచి నాయకులకు అధికారులకు ఆదేశాలు వచ్చాయి. భీమిలికి ఈరోజు నీటి సరఫరా చేయడం జరిగింది. అవసరమైన చోట బల్క్ వాటర్ కూడా అందించే చర్యలు చేపట్టాం. నీటి సమస్య ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. పరిష్కారం కోసం చర్యలు కొనసాగుతున్నాయి
వైసీపీ నేతలు నీటి సమస్యపై అనవసరంగా షో చేస్తున్నారు. 2014–19 మధ్య 60 వేల పట్టాలు ఇచ్చారు.. ఇప్పుడు మరో 20 వేల పట్టాలు ఇచ్చాం. దాదాపు 30 వేల కుటుంబాలు భరోసాతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.




