Visakhapatnam: జీవీఎంసీ విజేతలను సత్కరించిన గంటా రవితేజ!
Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లను సత్కరించి అభినందనలు తెలిపిన యువనేత గంటా రవితేజ.
Visakhapatnam: జీవీఎంసీ విజేతలను సత్కరించిన గంటా రవితేజ!
Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లను యువనేత గంటా రవితేజ ఘనంగా సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆయా వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం అనేది కేవలం పదవి మాత్రమే కాదని, ప్రజలు అప్పగించిన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రజాప్రతినిధులుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విజయం సాధించిన 1వ వార్డు కార్పొరేటర్ ఇప్పాక వరలక్ష్మి , 2వ వార్డు కార్పొరేటర్ గరే సదానంద , 3వ వార్డు కార్పొరేటర్ గాడు చినికుమారి లక్ష్మి , 4వ వార్డు కార్పొరేటర్ పాసి సుస్మిత , 5వ వార్డు కార్పొరేటర్ చోడపల్లి గాయత్రి , 8వ వార్డు కార్పొరేటర్ పిల్లా రేవతి , 9వ వార్డు కార్పొరేటర్ నాగోటి రూపా కుమారి , 10వ వార్డు కార్పొరేటర్ గరే జ్యోతి , 11వ వార్డు కార్పొరేటర్ శాఖరి శ్రీను , 120వ వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం పాల్గొన్నారు.




