Bheemili: భీమిలి జీవీఎంసీ 1వ వార్డులో ఉత్సాహంగా సాగిన కూటమి నేతల ఎన్నికల ప్రచారం!

Bheemili: జీవీఎంసీ 1వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఇప్పాక వరలక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ యువనేత గంటా రవితేజ విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

SHIVA, BHIMILI
Published on: 25 Oct 2026 11:35 AM IST
Bheemili
X

Bheemili: భీమిలి జీవీఎంసీ 1వ వార్డులో ఉత్సాహంగా సాగిన కూటమి నేతల ఎన్నికల ప్రచారం!

Bheemili: జీవీఎంసీ 1వ వార్డులో కూటమి అభ్యర్థి ఇప్పాక వరలక్ష్మి గారి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ యువనేత గంటా రవితేజ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుని, కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని కోరారు. ప్రజలతో మమేకమవుతూ కూటమి అభ్యర్థి విజయానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొప్పల రమేష్, తమ్మిన సూరిబాబు, పిట్ట సూరిబాబు, దండి వెంకటేష్, మద్దిల దేవుళ్లు, ఇర్నింటి వెంకటరావు, జనసేన నాయకులు నవీరి రాజు, ఇర్నింటి వంశీ, బీజేపీ నాయకులు అయినాడ మాధవరావు, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI