Chodavaram: శ్రీరామపట్నంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం శ్రీరామపట్నంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపూజీకి నివాళులర్పించి స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టారు.
Chodavaram: శ్రీరామపట్నంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
అనకాపల్లి జిల్లా: చోడవరం మండలం శ్రీరామ పట్నం గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ జనసేన నాయకులు జెర్రిపోతుల నానాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, గ్రామ స్వరాజ్యం నేటి యువతకు ఆదర్శమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్వయంభూ విగ్నేస్వరాలయం ఛైర్మన్ మంగా శ్రీను, గట్ రెడ్డి గంగాధర్ పంచాయతీ కార్యదర్శి నక్కా రమణ బాబు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వై. సిద్ధు, మండల పరిషత్ SGSW డిప్యూటీ MPDO బి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు.




