Gajuwaka: 92వ వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం పెంటకోట లీలాదేవి!

Gajuwaka: విశాఖ గాజువాక 92వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి లీలాదేవి తెలిపారు. ఫ్లూటు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.

PRAKASH, GAJUWAKA
Updated on: 27 Oct 2026 11:36 AM IST
Gajuwaka
X

Gajuwaka: 92వ వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం పెంటకోట లీలాదేవి!

Gajuwaka: దయాలనగర్ పార్టీ కార్యాలయంలో 92వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీమతి పెంటకోట లీలాదేవి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు . 92వ వార్డు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిలుపుతానని శ్రీమతి పెంటకోట లీలదేవి అన్నారు.

ప్రతిరోజు ప్రచారంలో భాగంగా వార్డులో ఉన్నటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రజలు తనని నీరాజనం పడుతున్నారని తన గెలుపు కోసం ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారని శ్రీమతి పెంటకోట లీలదేవి అన్నారు ప్రతి క్షణం నీకు అందుబాటులో ఉంటానని , 92 వ వార్డులో కొండవాలు ప్రాంతంలో జీవీఎంసీ మంచి నీరు అందిస్తాను అని , డ్రైనేజీలు కాలువలు అభివృద్ధి చేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని వార్డు ప్రజలకు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పెంటకోట లీలాదేవి హామీ ఇచ్చారు. ఫ్లూటు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం ప్రజలు చేకూర్చాలని ఆమె అభ్యర్థించారు.

అలాగే పెంటకోట శంకర్రావు గారు మాట్లాడుతూ కొండవాలు ప్రాంతంలో వర్షం గాని తుఫాను గాని వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఎటువంటి రక్షణ కూడా లేకపోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అని అటువంటి సమస్య లేకుండా కాంక్రీట్ తో రిటర్నింగ్ గోడ నిర్మించి శాశ్వత పరిష్కారం కలిపిస్తానని పెంటకోట శంకర్రావు హామీ ఇచ్చారు,

అలాగే ప్రభుత్వ పథకాలతో పాటు ఏదైనా సమస్య ఉంటే జీవీఎంసీ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా కార్యాలయంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడే సమస్య పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని పెంటకోట శంకర్రావు అన్నారు.

అలాగే విద్య ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఉచితంగా అందే విధంగా శ్రమిస్తానని , అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పూర్తిస్థాయిలో కృషి చేస్తానని పెంటకోట శంకర్రావు గారు హామీ ఇచ్చారు. 92 వ వార్డు ప్రజలు దయచేసి ఫ్లూటు గుర్తుపై ఓటు వేసి తన గెలిపించాలని ఆయన కోరారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA