Gajuwaka: 91వ వార్డులో పోటెత్తిన జనం.. తిప్పల వంశీరెడ్డి భారీ పాదయాత్ర!
Gajuwaka: 91వ వార్డులో పోటెత్తిన జనం.. తిప్పల వంశీరెడ్డి భారీ పాదయాత్ర!
Gajuwaka: 91వ వార్డులో పోటెత్తిన జనం.. తిప్పల వంశీరెడ్డి భారీ పాదయాత్ర!
గాజువాక: నవంబర్ ఒకటో తేదీని జరిగే గ్రేటర్ ఎన్నికలలో జీవీఎంసీ 91 వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరంగుర్తు పై తిప్పల వంశి రెడ్డి పోటీ చేస్తున్నారు. శనివారం తన ప్రచారాన్ని పాదయాత్రతో ప్రారంభించి వార్డులోని ప్రతి ఇంటింటికి వెళ్లి ఉంగరం గుర్తుపై ఓటేసి తనని గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగతంలో తన కార్పొరేటర్ గాఉన్న వార్డులో తాను చేసిన అనేక అభివృద్ధి పనులు, సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. కాగా తాను నూతనంగా ఏర్పడిన 91 వార్డ్ నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ముందుగా గ్రామ దేవత అయిన సత్తెమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ జన సమూహం నడుమ ఆయన ముఖ్య అనుచరులు, అభిమానుల తో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.




