Gajuwaka: గాజువాకలో అర్నబ్ తుఫాను ముందస్తు అధికారుల సమీక్షా సమావేశం!

Gajuwaka: అర్నబ్ తుఫాను ముందస్తు జాగ్రత్తలపై గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల సమన్వయ సమావేశం. జోనల్ కమిషనర్ శేషాద్రి, తహసీల్దార్ త్రినాథ్ వెల్లడి.

PRAKASH, GAJUWAKA
Published on: 26 Oct 2026 4:40 PM IST
Gajuwaka
X

Gajuwaka: గాజువాకలో అర్నబ్ తుఫాను ముందస్తు అధికారుల సమీక్షా సమావేశం!

గాజువాక: అర్నబ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం గాజువాక మండల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అర్నబ్ తుఫాను ప్రత్యేక అధికారి, జీవీఎంసీ గాజువాక జోనల్ కమిషనర్ శ్రీ శేషాద్రి గారు, గాజువాక తహసీల్దార్ శ్రీ త్రినాథ్ గారు, గాజువాక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీ రామకృష్ణ గారు, దువ్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీమతి వెంకట్ లక్ష్మి గారు పాల్గొన్నారు. వీరితో పాటు రెవెన్యూ, జీవీఎంసీ, ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తుఫానుకు ముందు, తుఫాను సమయంలో, తుఫాను అనంతరం చేపట్టాల్సిన చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖలు సమన్వయంతో స్పందించడం, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం వంటి అంశాలపై చర్చించారు.

ప్రజలకు సూచనలు: వాతావరణ శాఖ జారీ చేసే అధికారిక హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలి.

తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో చర్చించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ తుఫాను నివారణ చర్యలకు సహకరించాలని అధికారులు సూచించారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA