Gajuwaka: పెన్షన్ సొమ్ము దుర్వినియోగం.. సచివాలయ ఉద్యోగి అరెస్ట్
Gajuwaka: గాజువాక మల్కాపురం పరిధిలో రూ. 2.17 లక్షల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు పంచకుండా వాడుకున్న సచివాలయ ఉద్యోగి అరెస్ట్, రిమాండ్; సొమ్ము రికవరీ.
Gajuwaka: పెన్షన్ సొమ్ము దుర్వినియోగం.. సచివాలయ ఉద్యోగి అరెస్ట్
గాజువాక: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జనతా కాలనీ సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఇండిగు బిల్లి దేవుడు బాబు పదవ నెలలో లబ్ధిదారులకు పంచాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు పంచకుండా తన సొంతానికి వాడుకోవడంతో జనతా కాలనీ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ జంపా నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు పై మల్కాపురం సిఐ నరసింహారావు గారు కేసు నమోదు చేశారు.
సిఐ గారి పర్యవేక్షణలో ఎస్ఐ అప్పలనాయుడు గారు కేసు దర్యాప్తు చేయిగా దర్యాప్తులో నిందితుడైన దేవుడు బాబు చెడు వ్యసనాలకు బానిసై వార్డ్ అడ్మిన్ నాగరాజు తనకు పెన్షన్లు పంచమని ఇచ్చిన 3 లక్షల రూపాయలలో 83,000/- రూపాయలు మాత్రమే పంచి మిగతా 2,17,000/- లబ్ధిదారులకు పంచకుండా తీసుకొని వెళ్ళిపోవడంతో ముద్దాయి వద్దు నుండి పోలీసు వారు 2,17,000/- ప్రభుత్వ ఎకౌంట్కి జమ చేయించి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం అయింది.




