Gajuwaka: గాజువాకలో మహిళపై దాడి చేసి దోపిడీ: 24 గంటల్లో నిందితుల అరెస్ట్
Gajuwaka: గాజువాకలో మహిళను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి బంగారం దోచుకెళ్లిన ఇద్దరు నిందితులను 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Gajuwaka: గాజువాకలో మహిళపై దాడి చేసి దోపిడీ: 24 గంటల్లో నిందితుల అరెస్ట్
విశాఖపట్నం: గాజువాక.. గాజువాక పోలీస్ స్టేషన్ పత్రికా సమావేశంలో ఏసిపి వెంకట్రావు మాట్లాడుతూ... పక్కా ప్లాన్ తో మహిళపై దాడి చేసి బంగారు తాళిబొట్ల తాడు లాక్కెళ్లిన నిందితుల అరెస్ట్. చోరీ సొత్తు మరియు ద్విచక్ర వాహనం రికవరీ 24 గంటల్లో కేసును ఛేదించిన విశాఖ సిటీ సౌత్ సబ్-డివిజన్ క్రైమ్ పోలీసులు.
దర్యాప్తులో భాగంగా, పాత పరిచయాన్ని ఆసరాగా చేసుకుని పక్కా వ్యూహంతో మహిళను నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి, ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను దోపిడీ చేసిన ఇద్దరు నిందితులను విశాఖ సిటీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు ముద్ద గీత భవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా సేకరించిన సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచి, మధ్యవర్తుల సమక్షంలో విచారించగా నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.
వారి వద్ద నుండి చోరికి గురైన బంగారు సొత్తును, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.




