Gajuwaka: గాజువాక బీహెచ్‌పీవీ బస్ స్టాప్ సమస్య పరిష్కారానికి ముందడుగు!

Gajuwaka: విశాఖ గాజువాక బీహెచ్‌పీవీ జంక్షన్ బస్ స్టాప్ సమస్య పరిష్కారానికి 84వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష, గుడివాడ లతీష్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశ్వరరావుతో భేటీ అయ్యారు.

PRAKASH, GAJUWAKA
Published on: 13 Nov 2026 4:05 PM IST
Gajuwaka
X

Gajuwaka: గాజువాక బీహెచ్‌పీవీ బస్ స్టాప్ సమస్య పరిష్కారానికి ముందడుగు!

గాజువాక: 84వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష గారు, గుడివాడ లతీష్ గారు గాజువాక ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ మల్లేశ్వరరావు గారిని, డిపో జాయింట్ సెక్రటరీ ప్రసాద్ గారిని కలిసి బీహెచ్‌పీవీ (BHPV) బస్ స్టాప్ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ గారు మాట్లాడుతూ, బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద ఉన్నది అధికారిక బస్ స్టాప్ కాకుండా కేవలం “రిక్వెస్ట్ స్టాప్” (Request Stop) మాత్రమేనని తెలిపారు. ఈ స్టాప్ నాలుగు రోడ్ల కూడలి ట్రాఫిక్ సిగ్నల్‌కు అతి సమీపంలో ఉండటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు.

దీనికి ప్రత్యామ్నాయంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో అనువైన ప్రదేశంలో బస్సులు నిలిపేలా చూడాలని కార్పొరేటర్ గుడివాడ అనూష గారు కోరారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ గారు, ట్రాఫిక్ సిగ్నల్‌కు సుమారు 150 మీటర్ల దూరంలో ప్రత్యామ్నాయ బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే అక్కడ బస్సులు నిలిపేందుకు అంగీకారం తెలిపారు.

దీనికి స్పందించిన కార్పొరేటర్ గుడివాడ అనూష గారు, GVMC సహకారంతో అవసరమైన స్థలంలో బస్ షెల్టర్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తాం.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA