Visakhapatnam: ఏయూలో రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసం!

Visakhapatnam: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డా. జస్టిస్ కె. రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసం చేసి, న్యాయ బంధు క్లబ్‌ను ప్రారంభించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 14 Nov 2026 5:51 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఏయూలో రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసం!

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డా. జస్టిస్ కె. రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసం చేశారు. "డిజిటల్ యుగంలో న్యాయ వృత్తి - అవకాశాలు, సవాళ్లు" అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని డా. బి.ఆర్. అంబేద్కర్ లా కళాశాల ఆధ్వర్యంలో, కేంద్ర న్యాయ శాఖ సహకారంతో నిర్వహించారు.

ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ అధ్యక్షత వహించారు. జస్టిస్ కె. రామస్వామి కుమారుడు కె. శ్రీనివాస్, ఐఏఎస్, లా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. సీతామణిక్యం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డా. బి.ఆర్. అంబేద్కర్ లా కళాశాలలో ప్రో-బోనో క్లబ్ (న్యాయ బంధు) ను ప్రారంభించారు.

రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలో...

"డా. బి.ఆర్. అంబేద్కర్ లా కళాశాలలో జస్టిస్ కె. రామస్వామి ఎండోమెంట్ ఉపన్యాసం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రజా బాధ్యతలు చేపట్టక ముందు నా ప్రయాణం కోర్టు వరండాల్లో న్యాయవాదిగా మొదలైంది. నేను న్యాయవాద వృత్తిలో గర్వించదగిన సభ్యుడిని. నేడు యువ న్యాయవాదుల మధ్య ఉండటం నాకు స్వగృహానికి తిరిగి వచ్చిన అనుభూతిని కలిగిస్తోంది" అని అన్నారు.

డిజిటల్ యుగంలో న్యాయ వృత్తిలో అవకాశాలు, సవాళ్లను వివరించిన ఆయన, న్యాయ బంధు ద్వారా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని యువ న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.