Bobbili: బొబ్బిలిలో సెప్టెంబర్ 21న ఈపీఎస్-95 పెన్షనర్ల ధర్నా!

Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో సెప్టెంబర్ 21న ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట EPS-95 పెన్షనర్ల ధర్నా.. కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని డిమాండ్.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 18 Sept 2026 3:20 PM IST
Bobbili
X

Bobbili: బొబ్బిలిలో సెప్టెంబర్ 21న ఈపీఎస్-95 పెన్షనర్ల ధర్నా!

Bobbili: మోడీ ప్రభుత్వం ధరలైన తగ్గించాలి - ఈపీఎస్ 95 పెన్షనర్లకు 1000/- నుండి పెన్షన్ 9000/- రూపాయలు డి ఏ తో కలిపి చెల్లించాలని సెప్టెంబర్ 21 సోమవారం బొబ్బిలి ఎమ్మార్వో ఆఫీస్ ధర్నా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి. శంకర్రావు ఉపాధ్యక్షులు వి. శేషగిరి డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెన్షన్ దారులు అందరూ పాల్గొవాలని కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 12 సంవత్సరాలుగా ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9000/- రూపాయలు డిఏ తో చెల్లించాలని, ఉచిత వైద్య సౌకర్యం, రైల్వే ప్రయాణంలో రాయితీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చేయలేదు.

మొన్న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పిఎఫ్ రికవరీ 15000/- నుండి 25 వేలకు పరిమితిని పెంచి మరికొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ఖజానా దోచుకుంటుంది అన్నారు. ఇదే క్యాబినెట్లో కనీస పెన్షన్ పెంచడానికి నిర్ణయం చేయలేదు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా అన్నారు.

వెయ్యి రూపాయలు పెన్షన్ తో అవసరాలు ఎలా తీరుతాయి బియ్యం, పప్పులు, నూనెలు, ఉల్లిపాయలు, కాయగూరలు సమస్త వస్తువ ధరలు ఈ కాలంలో భారీగా పెరుగుతున్నాయి మందులు, ఇతర అవసరాలకు ఇప్పుడున్న ధరలు తో ఎలా బ్రతకాలని అన్నారు.

దేశంలో లక్షల కోట్ల రూపాయలు ఆదానీ, అంబానీకి దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వం మా కష్టార్జితం లక్షల కోట్ల రూపాయలు ఖజానాలో దాచుకొని పెన్షనర్లకు కనీస పెన్షన్ 9000/- ఎందుకు చెల్లించరని నిలదీశారు. సెప్టెంబర్ 21 బొబ్బిలి ఎమ్మార్వో ఆఫీస్ ధర్నా డిసెంబర్ 1,2,3న చలో ఢిల్లీ చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శివు నాయుడు, టీవీ రమణ, పత్తి గొల్ల కృష్ణ పకీర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI