Madhurawada: మధురవాడలో ఈపీఎస్-95 పెన్షనర్ల సమావేశం!
Madhurawada: విశాఖపట్నం మధురవాడలో ఏపీఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎస్-95 పెన్షనర్ల సమావేశం. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఢిల్లీ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు.
Madhurawada: మధురవాడలో ఈపీఎస్-95 పెన్షనర్ల సమావేశం!
Madhurawada: మధురవాడ ఏరియా ఈపీఎస్-95 పెన్షనర్ల సమావేశం ఏపీఆర్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు పీఎం పాలెం బింద్రానగర్లోని సుందరయ్య పార్కులో ఈటీ శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు రెడ్డిపల్లి బాబూరావు మాట్లాడుతూ, డిసెంబర్ 15, 16 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను వివరించారు.
జిల్లా ఏపీఆర్ సంఘం గౌరవ అధ్యక్షుడు కె. సుధాకర్ మాట్లాడుతూ, హయ్యర్ పెన్షన్పై కోర్టు తీర్పులు, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. పెన్షనర్ల హక్కుల సాధన ఉద్యమంలో విశాఖపట్నం ముందుండి పోరాడుతోందని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి కూడా అధిక సంఖ్యలో పెన్షనర్లు ఢిల్లీ ధర్నాకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పెన్షనర్లకు కలుగుతున్న నష్టాలను, వాలిడేషన్ చట్టానికి సంబంధించిన అంశాలను వివరించారు. నవంబర్ 16న విద్రోహ దినం, డిసెంబర్ 17న పెన్షన్ దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఏపీఆర్ సంఘాల నాయకులు, కార్యకర్తలతో విశాఖపట్నంలో నిర్వహించనున్న సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సమావేశానికి హాజరై విజయవంతం చేసిన పెన్షనర్లకు అధ్యక్షుడు ఈటీ శేషగిరిరావు కృతజ్ఞతలు తెలియజేసి సమావేశాన్ని ముగించారు.




