Visakhapatnam: విశాఖలో వర్షాలు విద్యుత్ భద్రతపై అధికారుల హెచ్చరికలు!
Visakhapatnam: విశాఖలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తెగిన వైర్లు, స్తంభాలను ముట్టుకోవద్దని హెచ్చరించి కంట్రోల్ రూమ్ నంబర్లు జారీ చేశారు.
Visakhapatnam: విశాఖలో వర్షాలు విద్యుత్ భద్రతపై అధికారుల హెచ్చరికలు!
Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాల సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రోడ్లపై లేదా పొలాల్లో తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని అధికారులు హెచ్చరించారు. విద్యుత్ లైన్లు ఉన్న ప్రాంతాల్లో వరద నీరు నిలిచినప్పుడు అటువైపు వెళ్లకూడదని సూచించారు. చెట్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఇళ్లలో తడి చేతులతో స్విచ్‌లను తాకవద్దని, ఉరుములు మెరుపుల సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్‌లను తొలగించాలని సూచించారు. పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టవద్దని అధికారులు స్పష్టం చేశారు.
ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడటం, స్తంభాలు నేలకూలడం లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లా విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు.
సర్కిల్ కార్యాలయం, మహారాణిపేట: 738224988
జోన్–1 డివిజన్, మహారాణిపేట: 9490610019
జోన్–2 డివిజన్, కంచరపాలెం: 9849628880
జోన్–3 డివిజన్, మధురవాడ: 9491030722
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.




