Malkapuram: దుర్గానగర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల రాట ప్రారంభం!
Malkapuram: మల్కాపురం 62వ వార్డు దుర్గానగర్‌లో గణేష్ ఫ్రెండ్స్ యూత్ మరియు స్థానిక మహిళల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాల ఉత్సవ రాట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
Malkapuram: దుర్గానగర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల రాట ప్రారంభం!
Malkapuram: దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధి,62 వ వార్డు దుర్గానగర్ లో గణేష్ ఫ్రెండ్స్ యూత్ మరియు స్థానిక మహిళల ఆధ్వర్యంలో శుక్రవారం ఉత్సవ రాట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వార్డు టీడీపీ అధ్యక్షుడు మజ్జి మాలి నాయుడు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు.దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.కార్యక్రమంలో యూత్ సభ్యులు గంగాధర్, సూర్య ప్రకాష్ రావుకుమార్,సాయి,నాగరాజు,రవికుమార్, కుమార స్వామి,శంకరరావు, వంశీ,పవన్,సునీల్, ఈశ్వర్, లక్ష్మీ, జ్ఞాని,ప్రసన్న,ఇంద్ర,సత్యవతి,మహిళలు,భక్తులు,స్థానికులు పాల్గొన్నారు.




