Visakhapatnam: మద్యం మత్తులో బస్సు డ్రైవర్.. 40 మంది భక్తులతో శ్రీశైలం ప్రయాణం!

Visakhapatnam: విశాఖపట్నం నుంచి శ్రీశైలం వెళ్తున్న 40 మంది భక్తుల బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గాజువాక ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 29 Nov 2026 8:20 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: మద్యం మత్తులో బస్సు డ్రైవర్.. 40 మంది భక్తులతో శ్రీశైలం ప్రయాణం!

Visakhapatnam: వైజాగ్ నుంచి విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు 40 మంది భక్తులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును గాజువాక ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి 100 ఫీట్ జంక్షన్ వద్ద ఆపి డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు.

మద్యం సేవించినట్లు గుర్తించడంతో మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి బస్సును విడిచిపెట్టారు. మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ సీఐ హుస్సేన్ హెచ్చరించారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA