Anakapalli: అనకాపల్లి జిల్లాలో 25 వైన్ షాపులకు విజయవంతంగా డ్రా పూర్తి!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో మిగిలిన 25 వైన్ షాపులకు పారదర్శకంగా నిర్వహించిన డ్రా ప్రక్రియ. దరఖాస్తులు రాని మరో 14 షాపులు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో 25 వైన్ షాపులకు విజయవంతంగా డ్రా పూర్తి!
Anakapalli: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా 25 వైన్ షాపులకు డ్రా ప్రక్రియ నిర్వహించారు. అనకాపల్లి గుండాల జంక్షన్ సమీపంలోని శంకరం మీటింగ్ హాల్‌లో ఈ డ్రా కార్యక్రమం జరిగింది.
అనకాపల్లి జిల్లాలో మొత్తం 161 వైన్ షాపులు ఉండగా, అందులో 122 షాపులను రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన 39 షాపులు రెన్యువల్ కాకుండా ల్యాప్స్‌లోకి వెళ్లాయి.
ల్యాప్స్‌లో ఉన్న 39 షాపుల్లో 25 షాపులకు దరఖాస్తులు రావడంతో, వాటికి సంబంధించి గురువారం డ్రా నిర్వహించారు. మరో 14 షాపులకు ఎలాంటి దరఖాస్తులు రాకపోవడంతో వాటికి డ్రా నిర్వహించలేదు.
జిల్లా ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ అధికారి సుధీర్, డీఆర్వో ఆధ్వర్యంలో డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎక్సైజ్ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో పాటు వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పాల్గొన్నారు. దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా డ్రా ప్రక్రియను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.




