Anakapalli: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో పూడికతీత పనులు ప్రారంభం!

Anakapalli: అనకాపల్లి మండలం తుమ్మపాలలోని చెర్లోపల్లి కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు ప్రారంభించారు. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 8 Oct 2026 4:55 PM IST
Anakapalli
X

Anakapalli: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో పూడికతీత పనులు ప్రారంభం!

Anakapalli: అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త, పూడికతో సమస్యగా మారిన చెర్లోపల్లి కాలువకు పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించే పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు, అనకాపల్లి జివిఎంసి సహకారంతో కాలువలో పూడికతీత పనులను అధికారులు చేపట్టారు.

పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా పరిశీలించారు. కాలువను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

చెర్లోపల్లి కాలువలో ఎన్నో సంవత్సరాలుగా పూడిక పేరుకుపోవడంతో వర్షాలు కురిసిన సమయంలో నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం పూడికతీత పనులు చేపట్టడంతో కాలువలో నీటి ప్రవాహం మెరుగుపడటంతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.

స్థానిక ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాలువ పూడికతీత పనులు ప్రారంభం కావడంతో తుమ్మపాల డ్రైనేజీ వ్యవస్థకు ఊరట లభిస్తుందనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI