Parawada: లంకెలపాలెం బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి!

Parawada: విశాఖ జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని CITU రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 21 Sept 2026 2:28 PM IST
Parawada
X

Parawada: లంకెలపాలెం బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి!

Parawada: లంకెలపాలెం బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి డిమాండ్. పరవాడ.( లంకెలపాలెం) లంకెలపాలెం బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగనిశెట్టిసత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారంపెద్దపెద్దరంధ్రాలు ఏర్పడ్డ లంకెలపాలెం బ్రిడ్జిని పరిశీలించారు. హిందూజా బొగ్గు లారీలు అధిక లోడుతో ప్రయాణించడం వలన ఈ బ్రిడ్జి ఈ దుస్థితికి వచ్చిందని అన్నారు.

వెంటనే బ్రిడ్జికి శాశ్వతమైన మరమత్తులు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఎన్టిపిసి ప్లేయష లారీలు అధిక లోడుతో ప్రయాణించడం వలన ఆర్టీవో అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్ అండ్ బి అధికారులు వెంటనే చర్యలు చేపట్టి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందూజా పరిశ్రమ నుండి సి ఎస్ ఆర్ నిధులు ఈ బ్రిడ్జి శాశ్విత మరమ్మత్తులు చేపట్టడానికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు.

అధిక లోడ్లను అరికట్టి బొగ్గు కాలుష్యం నుండి ప్రజల్ని కాపాడాలని డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదును కూడా అందజేసినట్లు గని శెట్టి తెలిపారు. పరిశీలన కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కే నర్సింగరావు,జి.రామారావు,కే.ప్రసాద్ ,కేనాగేశ్వరరావు,జిరమణ,బిఅప్పలరాజుతదితరులు పాల్గొన్నారు

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.