Gajuwaka: గాజువాక జనసేన ఇంచార్జ్ కోన తాతారావుపై దాసరి జ్యోతి తీవ్ర ఆరోపణలు!
Gajuwaka: విశాఖపట్నం గాజువాకలో జనసేన ఇంచార్జ్ కోన తాతారావుపై 95వ వార్డు స్వతంత్ర అభ్యర్థి దాసరి జ్యోతి తీవ్ర విమర్శలు.
Gajuwaka: గాజువాక జనసేన ఇంచార్జ్ కోన తాతారావుపై దాసరి జ్యోతి తీవ్ర ఆరోపణలు!
Gajuwaka: గాజువాక జనసేన ఇంచార్జ్ కోన తాతారావుపై 95వ వార్డు స్వతంత్ర అభ్యర్థి, జనసేన నాయకురాలు దాసరి జ్యోతి తీవ్ర విమర్శలు. ప్రజా సమస్యలపై స్పందించని కోన తాతారావు ఇప్పుడు ఎన్నికల వేళ ఓట్ల కోసం హామీలు ఇస్తున్నారని దాసరి జ్యోతి ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు, ఆధార్ కార్డుల బ్లాకింగ్, ఉపాధి ఇబ్బందులపై ఆయన స్పందించలేదని విమర్శించారు.
సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేస్తున్న సమయంలో మద్దతుగా నిలవలేదని పేర్కొన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని నాయకులు ఎన్నికల సమయంలో గడపగడపకూ తిరుగుతూ హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు మాయమాటలు నమ్మకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని దాసరి జ్యోతి ఓటర్లకు పిలుపునిచ్చారు.




