Anakapalle: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!
Anakapalle: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.
Anakapalle: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!
Anakapalle: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, అనకాపల్లి గవరపాలెంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆలయ మండపంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ పూజలు ప్రారంభించారు.
శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




