Visakhapatnam: విశాఖ మల్కాపురంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం సీపీఎం ధర్నా!

Visakhapatnam: మల్కాపురం ప్రాంతంలోని జయేంద్ర కాలనీ, కాకర్ల లోవ, చింతల లోవ, గుల్లలపాలెంవాసులకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.

PRAKASH, GAJUWAKA
Published on: 8 Oct 2026 11:57 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ మల్కాపురంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం సీపీఎం ధర్నా!

Visakhapatnam: జయేంద్ర కాలనీ కాకర్ల లోవ చింతల లోవ గుల్లలపాలెం లో నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో మొలగాడ తాసిల్దార్ కార్యాలయంలో ధర్నా చేపట్టారు...

జగ్గు నాయుడు సిపిఎం నేత కామెంట్స్:

100 సంవత్సరాలు చరిత్ర గల మల్కాపురం గ్రామంలో ఇల్ల రిజిస్ట్రేషన్ ప్రభుత్వం వెంటనే చేయాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మారిన స్థానికంగా వీరికి న్యాయం జరగటం లేదు. హెచ్పీసీఎల్ షిప్యాడ్ రాక ముందు నుంచి వీరు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ చెయ్యమంటే వారి స్థలాలు నేవీ కి చెందినవని చెప్తున్నారు.

ఈ కంపెనీలు రాక ముందు నుంచి స్థానికులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ స్థలాలు గ్రామ కంఠంలో ఉన్నాయి అంటున్నారు వేరే ప్రాంతంలో గ్రామ కంఠంలో ఉన్న స్థలాలను రెగ్యులర్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరైనా చనిపోయిన లేక ఆ ఇంటిని అమ్ముకుందామన్న వేరే వారి పేరు మీద పట్టాన్ని బదిలీ చేయకుండా చేయడం లేదు.

దీనిపై ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ని ముట్టడిస్తాము.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA