Madhurawada: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి!
Madhurawada: బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు.
Madhurawada: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి!
Madhurawada: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ SIR పేరుతో ఓట్లు చోరీ చేసి ఎకపక్ష నిర్ణయాలతో అప్రజాస్వామిక చర్యలకి పాల్పడి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు.
ధరల మంటలో సామాన్యుడి బతుకుపై సిపిఐ శ్రేణులు శనివారం రాత్రి జీవీఎంసీ మధురవాడ ఏరియా అయోధ్యనగర్, కొత్తపాలెం, మానం ఆంజనేయులు నగర్ తదితరులు ప్రాంతాల్లో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచారు. ఈ సందర్బంగా పైడిరాజు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు అదుపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశంలో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకు రోజురోజుకూ భారమవుతోందన్నారు. కూరగాయలు కొనాలన్నా, నెలవారీ సరుకులు తెచ్చుకోవాలన్నా డబ్బులు సరిపోవడం లేదని చాలి చాలని ఆదాయంతో అప్పుల పాలవుతున్నారన్నారు. ఆరు నెలల కిందట రూ.40గా ఉన్న చక్కెర ఇప్పుడు ఏకంగా రూ.100 కి పెరిగిందని, 1300 వందలు ఉన్న 26 కిలోల బియ్యం బస్తా ధర ఏకంగా రూ.2000 అయ్యిందని, ఉల్లి కిలో రూ.100, అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయని ధరలు అదుపులోకి తేవలసిన పాలకులు చర్యలు విఫలం చెందారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా పార్టీ కార్యదర్శి వి సత్యనారాయణ, ఎం డి బేగం, ఎం ఎస్ పాత్రుడు, వానపల్లి అప్పలరాజు, ఎన్ త్రినాధ్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




