Gajuwaka: గాజువాక 92వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మానస ప్రచారం దూకుడు!

Gajuwaka: గాజువాక 92వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మానస శరవేగ ప్రచారం. దుర్గవాణిపాలెం, ఎస్సీ కాలనీల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన.

PRAKASH, GAJUWAKA
Published on: 22 Oct 2026 5:17 PM IST
Gajuwaka
X

Gajuwaka: గాజువాక 92వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మానస ప్రచారం దూకుడు!

Gajuwaka: గాజువాక 92వ వార్డు ప్రచారం లో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి కంటిపాముల మానస జి వి ఎం సి ఎన్నికల ప్రచారంలో 92వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కంటిపాముల మానస శరవేగంతో దూసుకుపోతున్నారు. ఈ రోజు పెంట మాంబ ఆశీస్సులు దళిత నాయకులు ఆసిస్సులు తీసుకొని దుర్గవాణిపాలెం సీత నగరం నెల్లి ముక్కు sc కాలనీ లో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ ప్రాంతంలో ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. మా ఇంటి ఆడ బిడ్డ కి మేము అందరు సపోర్ట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మా దళిత ఆడ పడుచు ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు అంటున్నారు ఈ విషయంలో మాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని నిస్వార్ధంగా ప్రజాసేవ చేసుకుంటూ కౌన్సిల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని మానస అన్నారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి అప్పలరాజు, వరలక్ష్మి, శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA