Visakhapatnam: విశాఖలో 12 గుడ్లు మింగి ఇరుక్కుపోయిన నాగుపాము, అడవికి తరలింపు!

Visakhapatnam: విశాఖలోని ఓ ఇంట్లో కోళ్ల గూడులోకి దూరిన నాగుపాము 12 గుడ్లు మింగి కదలలేక ఇరుక్కుపోయింది. స్నేక్ క్యాచర్ సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 2 Oct 2026 8:41 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో 12 గుడ్లు మింగి ఇరుక్కుపోయిన నాగుపాము, అడవికి తరలింపు!

Visakhapatnam: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయన్ అనేలా ఉంది ఆ పాము పరిస్థితి.. విశాఖలో శనివాడ కాలని కి చెందిన రైతు నరేష్ ఇంట్లో కోళ్ల గూడు లోకి దూరిన నాగు పాము 12 గుడ్ల నీ మింగేసింది. దీంతో ఎటు కదలలేక అక్కడే ఉండిపోయింది.

ఇది గమనించి రైతు స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేస్తే , వాళ్ళు నాగు పాము తోక పట్టుకుని వేలడాదీయగా 12 గుడ్లూ బయటకి వచ్చేశాయి. గుడ్లు పెట్టిన కోడి పాము కాటు కి చనిపోయింది. పాము నీ మాత్రం స్నేక్ క్యాచర్ సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.