Visakhapatnam: సి గ్రాస్, మార్నింగ్ గ్లోరీ మొక్కలకు ప్రాధాన్యత కల్పించాలి!
Visakhapatnam: తీర ప్రాంత రక్షణ కోసం మొగలి వనాలతో పాటు సి గ్రాస్, మార్నింగ్ గ్లోరీ వంటి మొక్కలను విరివిగా పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జె.వి. రత్నం పిలుపునిచ్చారు.
Visakhapatnam: సి గ్రాస్, మార్నింగ్ గ్లోరీ మొక్కలకు ప్రాధాన్యత కల్పించాలి!
Visakhapatnam: తీర ప్రాంత రక్షణ కోసం మొగలి వనాలనూ పెంచండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్విరాన్మెంటల్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా సాగర్ నగర్ లోని సాగర తీరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తాటి చెట్లు, సరుగుడు వనాలు పెను తుఫాను ల సమయంలో పెను గాలుల నుండి తీర ప్రాంతాన్ని కాపాడతాయి అన్నారు.
మొగలి డొంకల వేరు వ్యవస్థ మడ చెట్ల వలె పోర్క్ టైపులో తీరం లోని ఇసుక తిన్నెల లోకి గుచ్చుకొని ఉంటుందన్నారు. దీని వేరు వ్యవస్థ ఇసుక తిన్నెలను పట్టి ఉండటం వల్ల అలల తాకిడికి తట్టుకొని తీరం కోతకు గురికాకుండా ఆపుతుందన్నారు. ఇలాంటి బలమైన వేరు వ్యవస్థ కలిగిన మొగలి డొంకలు, తాటి, సరుగుడు చెట్లు కలిసి ఉంటే తీర ప్రాంతానికి పెను రక్షణ కలుగుతుంది అన్నారు.
అలాగే తీర ప్రాంతంలోని రక్షణ వనాలు మత్స్యకారులకు ట్రీ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసి ప్రాంతంలో అడవులను పరిరక్షించినట్లుగా వీటినీ పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా మొగలి డొంకల నుండి అత్తరు తీసి అమ్మితే కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. తాటి చెట్ల నుండి బెల్లం తయారు చేస్తే అందరి ఆరోగ్యం బాగుపడుతుందని, లక్షలాది రూపాయలు ఆదాయం వస్తుందని వివరించారు.
పెను గాలులకు ఇసుక తిన్నెలు దెబ్బ తినకుండా పట్టి ఉంచే సి గ్రాస్, మోర్నింగ్ గ్లోరీ తీగ, గడ్డి జాతికి చెందిన పలు రకాల మొక్కలకు ప్రాధాన్యత కల్పించండి అని కోరారు. ప్రధానంగా సి గ్రాస్ దీనిని రావణాసురుడు మీసాలు అని కూడా అంటారు. దీనికి ప్రతి మూడు అంగుళాలకు ఒక కణుపు వస్తుంది, ఆ కణుపు దగ్గర నుంచి అయిదు నుండి 10 వరకు ఒక ఫ్లవర్ వలె తీగలు వచ్చి ఆ తీగలు మరలా పొడవుగా పెరుగుతూ పోతాయి అన్నారు.
ప్రతి కణుపు దగ్గరా వేర్లు రావడం ద్వారా అది ఇసుక తిన్నలను గట్టిగా పట్టి ఉంచుతుంది అన్నారు. అలాగే మార్నింగ్ గ్లోరీ విషయానికి వస్తే ఇది తిన్నగా ప్రాకుతూ పోయి ఇసుక తిన్నలపై ఒక ఆకుపచ్చ తెరలా చుట్టుకుని ఉంటుంది, ఫలితంగా ఎటువంటి గాలులు వచ్చినా ఇసుక తిన్నెలు చెదిరిపోకుండా కాపాడుతుంది అని వివరించారు.
తీరంలో పెరిగే పల్లేరు మొక్కలు అధికంగా పెంచండి అని సూచించారు. ఇవి వర్షాకాలంలో అత్యధికంగా పెరిగిపోతాయి అన్నారు. వర్షాకాలంలో పెరిగినా ఈ పల్లేరు మొక్కలు తర్వాత కాలంలో ఎండిపోయి తేమను పట్టి ఉంచెందుకు ఒక స్పాంజ్ బెడ్ వలే ఉపయోగపడతాయని వివరించారు.
తీర ప్రాంత రక్షణలో కాక్టస్ జాతి మొక్కలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని కోరారు. ప్రధానంగా ఈ కాక్టస్ మొక్కలను రహదారి పక్కనుండి జంతువులు సముద్రాల వైపు వెళ్లకుండా కంచె కోసం వినియోగించాలని కోరారు.
సాగర్ నగర్ తీరంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా కోస్తా తీరంలో గ్రేట్ గ్రీన్ బ్యారియర్ అనే పేరుతో అటవీ శాఖ పెంచుతున్న షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ కు పశువుల నుండి తీవ్రమైన నష్టం ఏర్పడుతుందన్నారు.
దీనిని దృష్టిలోనికి తీసుకుని గతంలో వన సంరక్షణా సమితుల్లోనికి పశువులు వెళ్లకుండా ఆపించిన ప్రభుత్వం,తీర ప్రాంత రక్షణ వనాలను కాపాడేందుకు పశువులు తీరం లోనికి వెళ్లకుండా నిషేధించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అలాగె అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం అవసరం అన్నారు. లేకుంటే ఇంత ఖర్చు చేసి పెంచుతున్న గ్రేట్ గ్రీన్ బ్యారియర్ కు పశువుల వల్ల నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.




