Araku: కూటమి హామీలు బూటకం.. సంక్షేమానికి కోత: రేగం చాణక్య తీవ్ర ధ్వజం
Araku: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెట్టిందని అరకు నియోజకవర్గంలో ఐడీ కార్డుల పంపిణీ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత రేగం చాణక్య విమర్శించారు.
Araku: కూటమి హామీలు బూటకం.. సంక్షేమానికి కోత: రేగం చాణక్య తీవ్ర ధ్వజం
Araku: ఈ రోజు అరకు నియోజకవర్గం,అనంతగిరి మండలం కోనాపురం,బొర్రా, అనంతగిరి,ఎగువశోభా గ్రామ పంచాయతీల పరిధిలో మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు,బూత్ కమిటీల బలోపేతం,జెండా ఆవిష్కరణ మరియు ఐడీ కార్డుల పంపిణీపై విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి.
కోనాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు పాల్గొనగా, మిగిలిన పంచాయతీలలో రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు రేగం చాణక్య గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేగం చాణక్య గారు మాట్లాడుతూ...
కార్యకర్తకు గుర్తింపు ఉండాలన్న జగనన్న ఆలోచనతోనే.
గత ప్రభుత్వంలో 64 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద ఏటా రూ.15,000 నేరుగా ఇచ్చామని,ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే దాన్ని 54 లక్షలకు కుదించి,రూ.13,000 తగ్గించి తల్లులను మోసం చేసిందని,వైఎస్సార్ చేయూతను పూర్తిగా ఎత్తేసి మహిళల నమ్మకాన్ని వమ్ము చేసింది.
చంద్రబాబు ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేకే ముగ్గురు కలిసి (టీడీపీ, జనసేన, బీజేపీ) కుట్ర పన్నారని,ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల మాటే ఫైనలని,మీరు కోరుకున్న వ్యక్తికే,మీ అభిప్రాయం మేరకే టికెట్ ఇస్తామని,ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారే స్వయంగా బీ-ఫారం అందజేస్తారని భరోసా ఇచ్చారు.
అంతేకాదు,ఐడీ కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు జగనన్న భరోసా - రూ.7.50 లక్షల ప్రమాద బీమా. అందులో రూ.2 లక్షల బీమా, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబానికి అదనంగా రూ.5.50 లక్షలు రూపాయలు అందుతాయని,ఈ పథకం ఈ నెల 1వ తేదీ నుండే అమలులోకి వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
* అనంతగిరి మండల మాజీ ఎంపీపీలు
* మాజీ వైస్ ఎంపీపీలు
* మాజీ ఎంపీటీసీలు
* మాజీ సర్పంచులు
* అనంతగిరి మండల కమిటీ నాయకులు
* వార్డు సభ్యులు
* గ్రామ కమిటీ అధ్యక్షులు తదితర వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




