Araku: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి!
Araku: అరకులో కూటమి పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో ప్రతీ స్థానాన్ని గెలుచుకోవాలని టీడీపీ ఇంచార్జ్ డా. సియ్యారి దొన్ను దొర పిలుపునిచ్చారు.
Araku: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి!
Araku: అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ.. స్థానిక ఎన్నికల్లో ప్రతి స్థానమూ గెలిచేలా అత్యంత వ్యూహాత్మకంగా వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా సియ్యారి దొన్ను దొర గారు పేర్కొన్నారు. అరకు వేలిలోని కూటమి పార్టీల సమన్వయ సమావేశం శుక్రవారం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు పేరాబత్తుల రాజశేఖరం, బుద్ధ నాగ జగదీష్ లు హాజరైన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొన్ను దొర గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంత సమన్వయంగా పనిచేస్తుందో అరకు నియోజకవర్గంలో కూడా అంతే సమన్వయంతో పని చేయాలన్నారు.
ఏ స్థానంలో ఏ అభ్యర్థిని బరిలో దించితే గెలిచే అవకాశాలు ఉన్నాయో చూసుకొని పోటీలో నిలపాలని సూచించారు. జనసేన, బిజెపి తెలుగుదేశం పార్టీ సమన్వయం చేసుకుంటూ ఏ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చే అవకాశం ఉందో ఏ అభ్యర్థికి ప్రజలు అనుకూలంగా ఉంటారో మూడు పార్టీల నేతలు చర్చించుకొని ఒక అభ్యర్థిని సూచించి ఆయననే అక్కడ పోటీలో నిలిపి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.
మనలో మనం కొట్టుకునే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దన్నారు. వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిజంగా గెలుస్తామనుకున్న స్థానాలను మాత్రమే బిజెపి జనసేన పార్టీలు సూచించాలన్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయామని అపవాది కంటే పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచి తమ సత్తాను చాటుకునేలా ఈ ఎన్నికలు ఉండాలన్నారు. గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు సూచించిన ఆదేశాలను జనసేన బిజెపి పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆదేశాలను కూడా టిడిపి కార్యకర్తలు నాయకులు పాటించాలని సూచించారు.




