Gajuwaka: సీఐఐ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లలో విశేష సేవలు: ఏసీపీ సౌత్‌కు ప్రశంస!
Gajuwaka: విశాఖ 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026 ప్రధాన వేదిక భద్రతా ఏర్పాట్లలో విశేష సేవలందించిన ఏసీపీ సౌత్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసా పత్రం అందజేశారు.
Gajuwaka: సీఐఐ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లలో విశేష సేవలు: ఏసీపీ సౌత్‌కు ప్రశంస!
గాజువాక: విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన 31వ CII Partnership Summit–2026 కార్యక్రమంలో భాగంగా ప్రధాన సమావేశ మందిరం (Main Hall), డయాస్ కార్యక్రమాలు మరియు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించిన సెంట్రల్ కోర్ ఏరియాలో భద్రతా ఏర్పాట్లను అత్యంత సమర్థవంతంగా పర్యవేక్షించి, కార్యక్రమాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఏసీపీ సౌత్ గారిని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభాముఖంగా అభినందించి, తన చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరైన నేపథ్యంలో, ప్రధాన వేదిక పరిసరాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం, డయాస్ కార్యక్రమాల నిర్వహణలో సమన్వయం పాటించడం, వివిధ విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో విధులను నిర్వహించడం వంటి అంశాల్లో ఏసీపీ సౌత్ గారు మరియు వారి సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వర్తించారు.
ప్రధాన కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేలా పోలీస్ శాఖ ముందుండి భద్రతా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం విశేషం.
ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి, సమన్వయం, క్రమశిక్షణ మరియు అంకితభావానికి ఈ ప్రశంస గుర్తింపుగా నిలిచింది.




