Araku: అల్లూరి జిల్లాలో క్లీన్ స్వీపే లక్ష్యం: ఎంపీ తనుజ రాణి
Araku: అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో 11 మండలాలను క్లీన్ స్వీప్ చేసి జడ్పీ పీఠం దక్కించుకోవడమే లక్ష్యమని అరకు ఎంపీ డాక్టర్ తనుజ రాణి అన్నారు.
Araku: అల్లూరి జిల్లాలో క్లీన్ స్వీపే లక్ష్యం: ఎంపీ తనుజ రాణి
అల్లూరు జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అరకు లోక్సభ సభ్యురాలు డాక్టర్ తనుజ రాణి కంకణం కట్టుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాయం చేసేందుకు ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు.
మండలాల్లో మార్మోగుతున్న ప్రచారం
జిల్లాలోని 11 మండలాల జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని, నూతనంగా ఏర్పడిన అల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్సీపీ ఖాతాలో వేయడమే ఏకైక ధ్యేయంగా ఎంపీ తనుజ రాణి విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ప్రతి మండలంలో నిర్వహించిన సమావేశాలు, ప్రచార కార్యక్రమాలలో స్వయంగా పాల్గొంటూ కార్యకర్తల్లో, నాయకుల్లో కొత్త జోష్ నింపుతున్నారు.
బూత్ స్థాయి నుంచే బలమైన వ్యూహాలు
అరకు ఎంపీ సాగిస్తున్న జడివాన లాంటి ప్రచారంతో వైఎస్సార్సీపీ క్యాడర్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
గ్రామీణ మరియు బూత్ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత దృఢపరుస్తూ, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే విజయం రాబోయే 2029 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయోత్సవానికి నాంది కానుందని, రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకి తిరుగులేదని నిరూపించే దిశగా డాక్టర్ తనుజ రాణి వేగంగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సిపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకులను సమన్వయ పరుస్తూ ఏకతాటిపై నడిపిస్తున్న తనుజరాణి పట్టుదల చూస్తుంటే రాబోయే రోజుల్లో అల్లూరి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చి పార్టీ రుణం తీర్చుకోవాలని తపన ఆమెలో కనిపిస్తుందని పలువురు కొనియాడుతున్నారు.
ఏది ఏమైనా ఎంపీ తనుజరాని ప్రజలకు చేసిన సేవలు అభ్యర్థుల గెలుపుకు నాంది పలుకుతుంది అనడంలో సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.




