Chodavaram: ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజుకు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కృతజ్ఞతలు
Chodavaram: చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.28.43 కోట్ల బకాయిలు కేటాయించిన సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు రాజాన కొండ నాయుడు కృతజ్ఞతలు.
Chodavaram: ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజుకు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కృతజ్ఞతలు
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని చోడవరం చక్కెర కర్మాగారానికి చెరకు సరఫరా చేసిన సభ్య రైతులకు బకాయిలు చెల్లించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు తెలిపారు.
ఈరోజు జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతులకు చెల్లించాల్సిన ₹28.43 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే రాజు వెల్లడించారు.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే రైతులకు ఈ బకాయిల సొమ్ము అందుతుందని ఎమ్మెల్యే తెలిపారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రావికమతం మండల పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావు, మేడిచర్ల నాయుడు,కోట గోవిందరావు,Ex సర్పంచ్ గంజి మోది నాయుడు,ex ఎంపీటీసీ బంటు శ్రీను,మండల itdp అధ్యక్షులు గల్లా నాని బాబు,తాతలు,అంజి మరియు కూటమి నాయకులు.




