Chodavaram: ఏ4 మద్యం దుకాణాల ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం
Chodavaram: చోడవరం ఎక్సైజ్ పరిధిలో 6 ఏ4 మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం. అక్టోబర్ 1 వరకు గడువు, అక్టోబర్ 5న లాటరీ కేటాయింపు.
Chodavaram: ఏ4 మద్యం దుకాణాల ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం
చోడవరం: చోడవరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2026–2027 సంవత్సరానికి క్రింద పేర్కొన్న ఆరు మద్యం దుకాణాలను నిర్వహించుటకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
దుకాణాల వివరాలు:
మొత్తం :06
1. చోడవరం మండలం -3 దుకాణాలు
2. కె. కోటపాడు మండలం -2 దుకాణాలు
3. బుచ్చయ్యపేట మండలం -1 దుకాణం
దరఖాస్తుల సమర్పణ విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు 24.09.2026 నుండి 01.10.2026 అర్ధరాత్రి 12.00 గంటల వరకు
"https://oc.hpsproject.com
వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్/ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
దుకాణాల కాలపరిమితి:
ఈ దుకాణాల నిర్వహణ కాలపరిమితి 01.10.2026 నుండి 30.09.2027 వరకు ఉంటుంది.
లాటరీ తేదీ, సమయం మరియు ప్రదేశం:
దుకాణాల కేటాయింపు ప్రక్రియ 05.10.2026 ఉదయం 08.00 గంటల నుండి గుండాల జంక్షన్, ఎస్.ఆర్. శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్, అనకాపల్లి నందు గౌరవనీయులు అయిన జిల్లా కలక్టర్ , అనకాపల్లి వారి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో A4 మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించబడుతుంది.
ప్రతి A4 మద్యం దుకాణానికి 4 దరఖాస్తులు వచ్చిన పక్షంలోనే సంబంధిత దుకాణానికి లాటరీ నిర్వహించబడుతుంది. దరఖాస్తుదారులు సంబంధిత నిబంధనలు, దరఖాస్తు రుసుము మరియు ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించగలరు. లేదా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, చోడవరం స్టేషన్ నందు సంప్రదించగలరు.




