Chodavaram: వైసీపీ నేత అమర్‌నాథ్‌పై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు

Chodavaram: చోడవరంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పర్యటన. వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌పై 'చెల్లని రూపాయి' అంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన ఎంపీ.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 17 Sept 2026 7:55 AM IST
Chodavaram
X

Chodavaram: వైసీపీ నేత అమర్‌నాథ్‌పై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన అనకాపల్లి జిల్లా బిజెపి ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ని ఇక్కడి నుండి తరిమి కొడితే గాని ఈ రాష్ట్రం బాగుపడదని, గతంలో ఇక్కడ వైసిపి నుంచి పోటీ చేసిన ఒక జోకర్ని ఇక్కడి నుంచి పంపించి ఒక చెల్లని రూపాయిని చోడవరం నియోజకవర్గానికి దిగుమతి చేశారని గాజువాకలో చెల్లని రూపాయి చోడవరంలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు.

అనకాపల్లి, గాజువాకలో ప్రజలు పక్కన పెట్టిన తర్వాత చోడవరానికి వస్తున్నారని విమర్శించారు. అక్కడ చెల్లని రూపాయిని ఇక్కడ మార్చుకోవాలని చూస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అభివృద్ధి, ప్రజాసేవతోనే ప్రజల విశ్వాసం పొందాలని అన్నారు.

ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ చెల్లని రూపాయికి సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పి కూటమి నాయకులకి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM