Chodavaram: విజయవాడకు వెళ్లిన ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
Chodavaram: గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతు, కార్మికుల బకాయిలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు విజయవాడకు వెళ్లిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు.
Chodavaram: విజయవాడకు వెళ్లిన ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని గోవాడ సహకార చక్కెర కర్మాగార బకాయిల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలపై రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉండటంతో, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు గత సీజన్‌కు సంబంధించి సుమారు 29 కోట్ల రూపాయల చెరుకు బకాయిలు, అలాగే కార్మికులకు మూడు నెలల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీలతో కలిపి మరో 7 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రైతు సంఘాలు గత కొద్ది రోజులుగా ఫ్యాక్టరీ వద్ద ఆందోళనలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రేపు, బుధవారం 23వ తేదీన విజయవాడలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో గోవాడ బకాయిల అంశాన్ని ఒక అజెండాగా చేర్చి, నిధుల విడుదలకు సానుకూల నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయవాడ వెళ్లారు. అక్కడ సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.




