Chodavaram: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం: చోడవరంలో నిందితుడి అరెస్ట్

Chodavaram: వివాహం చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన జయవరపు వేణును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 2 Oct 2026 9:08 PM IST
Chodavaram
X

Chodavaram: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం: చోడవరంలో నిందితుడి అరెస్ట్

Chodavaram: చోడవరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 207/2026, U/s 69, 318(4), 351(2) BNS కేసులో నిందితుడైన జయవరపు వేణు, తండ్రి: లేట్ ఈశ్వరరావు, వయస్సు: 30 సంవత్సరాలు, గవరవరం గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లాను చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు.

సదరు నిందితుడు ఫిర్యాదుదారురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించి, ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని, అనంతరం వివాహం చేసుకోకుండా మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడిని 02.10.2026 తేదీన 11:45 గంటలకు అరెస్ట్ చేసి, గౌరవ PJCJ/JFCM కోర్టు, చోడవరం ఎదుట హాజరుపరిచారు. గౌరవ న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించగా, విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM