Chodavaram: చోడవరం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా డి.వి.ఆర్ ఖరారు!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నరసాపురానికి చెందిన డి.వి.ఆర్ నామినేషన్ ఖరారైందని ఇన్‌ఛార్జ్ గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 20 Oct 2026 10:41 AM IST
Chodavaram
X

Chodavaram: చోడవరం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా డి.వి.ఆర్ ఖరారు!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని చోడవరం మండలానికి సంబంధించిన జడ్పిటిసి అభ్యర్థిని ప్రకటించడంలో వైసీపీ. కూటమి కంటే ఒక అడుగు ముందు ఉందనే చెప్పవచ్చు.

ఇందులో భాగంగా నిన్న చోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన చోడవరం మాజీ వైసిపి మండల అధ్యక్షుడు డివిఆర్ ను చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు.

చోడవరం వైసిపి పార్టీ అభ్యర్థులను ఒక్కొక్కరుగా ప్రకటిస్తూ ఉండగా కూటమి మాత్రం అభ్యర్థుల ఎంపిక తుది నిర్ణయం లో తర్జనభజన లో ఉన్నట్టు సమాచారం.

కూటమిలో జనసేన టిడిపి బిజెపి మూడు పార్టీల నుండి ఎవరికి వారే తమకి కావాలంటూ పోటీ పడడమే దీనికి కారణంగా పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి వైసీపీ జడ్పిటిసి అభ్యర్థిగా డివిఆర్ ను ప్రకటించి రేసులో ముందుందని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.

చివరివరకు వైసీపీ జడ్పిటిసి అభ్యర్థుల రేసులో శరగడం సిమ్మునాయుడు డివిఆర్ హోరాహోరీగా ప్రయత్నించారు...... మొత్తానికి ఈ ఎపిసోడ్లో డివిఆర్ విజయం సాధించి వైసీపీ జడ్పిటిసి టికెట్ను సాధించారు.

ఈ సందర్భంగా డివిఆర్ మాట్లాడుతూ కచ్చితంగా ఈ ఎన్నికలలో జడ్పీటీసీగా గెలిచి చూపిస్తానని తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను అని తెలిపారు.

వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి డి వి ఆర్ కు వైసిపి చోడవరం టౌన్ అధ్యక్షులు దేవరపల్లి సత్య ,అనకాపల్లి జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, గూనూరు రాజేష్, రాష్ట్ర సోషల్ మీడియా విభాగం పందిరి శ్రీను తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM