Chodavaram: బుచ్చెయ్యపేటలో వరి పంటలను పరిశీలించిన ఏవో నారాయణరావు
Chodavaram: బుచ్చెయ్యపేట మండలంలో వరి పంటలను పరిశీలించిన ఏవో మల్ల నారాయణరావు; ఆకుముడత, దోమ పోటు నివారణకు రైతులకు కీలక యాజమాన్య పద్ధతులు సూచించారు.
Chodavaram: బుచ్చెయ్యపేటలో వరి పంటలను పరిశీలించిన ఏవో నారాయణరావు
అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గ పరిధిలోని బుచ్చయ్య పేట మండలంలో ఈరోజు ల్.సింగవరం, బంగారు మెట్ట, దిబ్బిడి, కందిపూడి గ్రామాలలో వరి పోలాలు బుచ్చయ్య పేట మండల వ్యవసాయ అధికారి మల్ల నారాయణరావు పరిశీలించడం జరిగింది.
గత పది రోజులు నుంచి వాతావరణంలో మార్పులు కారణం వలన రైతుల పొలాలలో ఎక్కువగా ఆకుముడత, దోమ ఎక్కువగా ఉన్నది దీనికి గాను ఏ పొలాలకైతే ఎక్కువగా ఉన్నదో ఆ రైతులు ఆకుముడతకు గాను ముల్లకంపను పొలంలో అడ్డుగా నిలువుగా ఒకసారి తిప్పినట్లయితే ఆకు చిగురులన్నియు కూడా విడిపోయి పురుగు ఉధృతి తగ్గుతుంది మరియు దోమ నివారణకు గాని పైమెట్రోజిన్ 50% WG (చెస్ ) అనే మందును లీటరు నీటికి గాను గ్రాములు 0.6 మీ.లీ కలిపి ఉదయం పూట గాని సాయంకాలపు వేళల్లో వరి మొదలు బాగా తడిచేటట్టు పిచికారి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం అధికారి రమణబాబు, హేమంత్ మరియు సేంద్రియ వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.




