Chintoor: చింతూరు డివిజన్‌లో 24×7 కంట్రోల్ రూమ్‌లు: సబ్ కలెక్టర్
Chintoor: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చింతూరు డివిజన్ వ్యాప్తంగా 24×7 అత్యవసర కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ శుభమ్ నోఖ్వాల్ తెలిపారు.
Chintoor: చింతూరు డివిజన్‌లో 24×7 కంట్రోల్ రూమ్‌లు: సబ్ కలెక్టర్
చింతూరు: భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు,కూనవరం, వీఆర్ పురం,ఏటపాక నాలుగు మండలాల్లో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు వర్షాలు మరియు వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు 24×7 డివిజనల్ మరియు మండల స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు సబ్-కలెక్టర్ శ్రీ శుభమ్ నోఖ్వాల్ తెలిపారు.ప్రజల సమస్యల పై తక్షణ స్పందనకు డివిజనల్ కంట్రోల్ రూమ్
చింతూరు ఐ.టి.డి.ఏ కార్యాలయ సమావేశ మందిరంలో డివిజనల్ స్థాయి 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు,సిబ్బందిని రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా నియమించటం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజల నుంచి వచ్చే అత్యవసర సమాచారాన్ని స్వీకరించి,సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేస్తూ సహాయక చర్యలను సమన్వయం చేయటం జరుగుతుంది అన్నారు.కంట్రోల్ రూమ్‌కు అందే ఫిర్యాదులు మరియు సమాచారంలో ప్రధానంగా
భారీ వర్షాలు, వరదల పరిస్థితులు, రహదారుల పై నీటి ప్రవాహం, రాకపోకలకు అంతరాయం, విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల సమస్యలు,ప్రజల భద్రతకు సంబంధించిన ఇతర అత్యవసర పరిస్థితులు వంటి అంశాల పై సమాచారం నమోదు చేసి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.నాలుగు మండలాల్లో మండల స్థాయి కంట్రోల్ రూమ్‌లు.
చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో మండల స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.ఆయా మండలాల్లో వర్షాలు, వరదల పరిస్థితులను స్థానిక స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.మండల స్థాయిలో అందే సమాచారాన్ని సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ శాఖ మరియు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.కంట్రోల్ రూమ్ సంప్రదింపు నంబర్లు
డివిజనల్ కంట్రోల్ రూమ్
సబ్-కలెక్టర్ కార్యాలయం, చింతూరు
9490026397
8121729228
చింతూరు మండల కంట్రోల్ రూమ్
9492527695
కూనవరం మండల కంట్రోల్ రూమ్
9652814712
వీఆర్ పురం మండల కంట్రోల్ రూమ్
8008100892
ఏటపాక మండల కంట్రోల్ రూమ్
8332085268
ప్రజలకు అధికారుల సూచనలు
భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సమీప కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వరద ప్రవాహాలు,నీట మునిగిన రహదారులు మరియు ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
చింతూరు డివిజన్‌లో వర్షాలు,వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలను సంబంధిత శాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు సబ్-కలెక్టర్ శ్రీ శుభమ్ నోఖ్వాల్ తెలిపారు.




