Chintapalli: తాజంగి రిజర్వాయర్‌ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Chintapalli: భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగి రిజర్వాయర్‌ నీటి నిల్వ, విడుదల వ్యవస్థలను స్మాల్ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.

SAI, PADERU
Published on: 22 Sept 2026 5:33 PM IST
Chintapalli
X

Chintapalli: తాజంగి రిజర్వాయర్‌ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

ఏ ఎస్ ఆర్ జిల్లా పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, తాజంగి గ్రామంలోని తాజంగి రిజర్వాయర్‌ను మంగళవారం ఉదయం జలవనరుల శాఖ స్మాల్ ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అల్లూరి జిల్లా, పాడేరు ఎస్.ఎమ్.ఐ. E(SMI) డివిజన్ ఈఈ (Executive Engineer) ముక్కల రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈఈ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ...రాత్రినుండి భారీగా వర్షాలుపడుతున్నందున తాజంగి రిజర్వాయర్ నీటి సామర్థ్యం, నీటి విడుదల వ్యవస్థలను నిశితంగా పరిశీలించి డ్యూటీ లో ఉన్న సిబ్బంది కి పలు సూచనలు సేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌కు రెండు తూములు (Sluices) ఉన్నాయని, వీటి ద్వారా మొత్తం 167 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పొలాలకు అందుతోందని వెల్లడించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నామని, భారీ వర్షాలు కారణం గా సిబ్బంది నిరఅంతరం అప్రమత్తం గా వుండాలని రిజర్వాయర్ నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూన్న మని పేర్కొన్నారు.

వర్షపాతం వల్ల ఆయకట్టు కింద రైతులు అప్రమత్తంగా ఉండి, పంట పొలాలలో ఎక్కువ నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటూ, రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని నీటిని వృధా చేయరాదని పేర్కొన్నారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో ఈఈలుజనర్దన్, నాగేశ్వరరావు, ఈఇలు రామకృష్ణ, నాగమణి, నీటి సంఘ అధ్యక్షులు బాలయ్య , స్మాల్ ఇరిగేషన్ sub డివిజన్అధికారులు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU