Bheemili: భీమిలి బాలసదనంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
Bheemili: బాలల దినోత్సవం సందర్భంగా భీమిలి బాలసదనం బాలికల హాస్టల్లో జరిగిన వేడుకలకు యువ నాయకులు గంటా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
Bheemili: భీమిలి బాలసదనంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
భీమిలి: బాలల దినోత్సవం సందర్భంగా భీమిలిలోని బాలసదనం బాలికల హాస్టల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలకు యువ నాయకులు శ్రీ గంటా రవితేజ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులందరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో కాసేపు ముచ్చటించారు.
అనంతరం గంటా రవితేజ గారు మాట్లాడుతూ.. "విద్యార్థులందరూ క్రమశిక్షణతో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని" ఆకాంక్షించారు. అనంతరం పిల్లలందరితో కలిసి కేక్ కట్ చేసి, వారందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 3వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మీ గారు, 2వ వార్డు కార్పొరేటర్ గరే సదానంద గారు, 1వ వార్డు మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని సూరిబాబు గారు, రాష్ట్ర నాగవంశీయుల కార్పొరేషన్ డైరెక్టర్ గాడు సన్యాసినాయుడు గారు, 3వ వార్డు అధ్యక్షులు గొలగాని నరేంద్ర కుమార్ గారు, మాజీ కార్పొరేటర్ గంటా నూకరాజు గారు, పాసి త్రినాథ్ గారు, దండి వెంకటేష్ (చంటి) గారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




