Chalisigam: చలిసింగం ఆదివాసులకు తాగునీటి భరోసా: ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు
Chalisigam: రావికమతం మండలం చలిసింగం గ్రామంలో ఆదివాసుల తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు చొరవతో 3 బోరు బావుల రిగ్గింగ్ పనులు ప్రారంభమయ్యాయి.
Chalisigam: చలిసింగం ఆదివాసులకు తాగునీటి భరోసా: ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు
చలిసింగం: రావికమతం మండలం చలిసింగం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు చొరవ తీసుకున్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు సహకారంతో మూడు బోర్లకు మంజూరు చేయించి, రిగ్గింగ్ పనులు ప్రారంభించారు.
ఆదివాసుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో AE గారు,EX ఎంపీటీసీ బంటు శ్రీను,EX సర్పంచ్ జోగి పాత్రుడు, మండల ITDP అధ్యక్షులు గల్లా నాని బాబు పాల్గొన్నారు.




