Chodavaram: బుచ్చింపేటలో సిమెంట్ బెంచీల ఏర్పాటు!
Chodavaram: చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం బుచ్చింపేటలో ఎంపీ సీఎం రమేష్ సౌజన్యంతో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Chodavaram: బుచ్చింపేటలో సిమెంట్ బెంచీల ఏర్పాటు!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సౌజన్యంతో కొత్త వీధి లో జన సమూహం ఉండే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవటానికి అనువుగా రెండు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ సిమెంట్ బల్లలు ఏర్పాటు పట్ల మరియు వారి గ్రామానికి ఎంపీ సీఎం రమేష్ గారు అందిస్తున్న సహాయ సహకారాలు పట్ల బుచ్చింపేట గ్రామ ప్రజలు ధన్యవాదాలు, కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.




