Visakhapatnam: మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ సవాల్!

Visakhapatnam: విశాఖ మేయర్ ఎన్నికల వేళ రాజకీయ వేడి. కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి, ఎంపీ శ్రీభరత్‌లకు బహిరంగ చర్చకు సవాల్ విసిరిన తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్.

GOPI, PENDURTHI
Published on: 25 Oct 2026 4:22 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ సవాల్!

విశాఖపట్నం: విశాఖపట్నం మేయర్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నగర అభివృద్ధి, ప్రజా సమస్యలు, పాలనలో బాధ్యత వంటి అంశాలను ప్రస్తావిస్తూ తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ కూటమి నేతలను ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేమిటని రామ్ ప్రశ్నించారు?. సింహాచలం భూ సమస్య, పెరుగుతున్న ధరలు, భూ ఆక్రమణల ఆరోపణలు, దౌర్జన్యాలు, నేరాల వంటి సమస్యలను ప్రస్తావిస్తూ.. వీటిలో ఎన్ని పరిష్కారమయ్యాయని నిలదీశారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేయర్ అభ్యర్థి విజయానికి ఎంపీ శ్రీభరత్ బాధ్యత తీసుకున్నారనే అంశాన్ని ప్రస్తావించిన రామ్.. కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని తనకు తెలిసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న సందేహాలకు ఎంపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి మరియు ఎంపీ శ్రీ భరత్ ఇద్దరు ప్రజా సమస్యలు, నగర అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై బహిరంగ చర్చకు రావాలని రామ్ సవాల్ విసిరారు. ముక్కా శ్రావణి ముఖాముఖి చర్చకు సిద్ధమవుతారా? నగర సమస్యలపై తమ వైఖరిని ప్రజల ముందు వెల్లడిస్తారా? అన్న ప్రశ్నలను లేవనెత్తారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఈ సవాల్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI